కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రిక Rules
ఫోరం నియమ నిబంధనలు
In order to proceed, you must agree with the following rules:
టెక్నికల్ గా ప్రతీ ఒక్కరూ తమకు తెలిసిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రారంభించబడిన ఫోరం ఇది. కేవలం ఇతరుల పోస్టులు చదివి వెళ్లడం కాకుండా మీకు తెలిసిన అంశాలు అవి చిన్నవైనా పెద్దవైనా ఈ ఫోరంలో పోస్ట్ చెయ్యడం ద్వారా మీ వల్ల ఎంతోమంది ప్రయోజనం పొందుతారు. ఈ ఫోరంలో కొన్ని ప్రాధమిక నియమాలను అనుసరించవలసి ఉంటుంది. వాటికి కట్టుబడి ఉంఢేటట్లయితేనే ఈ ఫోరంలో రిజిస్టర్ చేసుకోండి. లేదంటే ఫోరం నియమాలను ఉల్లంఘించినట్లవుతుంది. తద్వారా ముందస్తు హెచ్చరిక లేకుండానే ban చెయ్యబడతారు. ఇవీ నియమాలు: 1. ఈ ఫోరంలో స్పామ్ పోస్టులు నిషిద్ధం. అంటే ఊరికే ప్రతీ మెసేజ్ కూ భారీ సంఖ్యలో thanks అంటూ మెసేజ్ లు టైప్ చేసి స్పామ్ చేసేవారి ఐడిలను తొలగించడం జరుగుతుంది. 2. మీరు చేయబోయే పోస్టులను తగిన విభాగంలోనే పోస్ట్ చేయాలి. ఉదా.కు.. ఏదైనా మీకు తెలిసిన సాఫ్ట్ వేర్ గురించి ఇతరులకు చెప్పదలిస్తే "సాఫ్ట్ వేర్ల వివరాలు" అనే విభాగంలోనే పోస్ట్ చేయాలి తప్ప "ఆసక్తికరమైన వెబ్ సైట్లు", "సందేహాలు అడగండి" వంటి ఇతర విభాగాల్లో పోస్ట్ చెయ్యకండి. ఫోరంలో ఎలా పోస్టులు చేయాలన్నది "ఫోరంని ఉపయోగించడంలో హెల్ప్" అనే విభాగంలో ఫొటోలతో సహా వివరంగా రాశాం చూడండి. 4. ఈ ఫోరంలో రేపిడ్ షేర్, megaupload లింకులు (అనధికారికమైనవి), అశ్లీల వెబ్ సైట్ లింకులు, ఇతర పోర్న్ కంటెంట్, ఇల్లీగల్ సాఫ్ట్ వేర్లు, సులభంగా డబ్బు సంపాదించవచ్చు అంటూ ప్రలోభపెట్టే లింకులు, ఫలానా సైట్ ని విజిట్ చేయండి.. మీ మొబైల్ బిల్ అంత తగ్గించుకోంఢి.. వంటి రిఫరెల్ లింకులు పూర్తిగా నిషిద్ధం. వాటిని ఖచ్చితంగా ప్రతీ సభ్యులూ పాటించాలి. 5. ఒక సభ్యుడు చేసిన పోస్ట్ కరెక్టు కాదనుకుంటే దానిని సున్నితంగా రిప్లై రూపంలో వ్యక్తపరచాలి తప్ప కించపరిచే విధంగా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించడం జరుగదు. 6. ఫోరంలో సభ్యులందరి మధ్య ఓ ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనేలా సభ్యుల ప్రవర్తన ఉండాలి.


Powered by vBulletin® Version 3.7.3
Copyright ©2000 - 2008, Jelsoft Enterprises Ltd.
Template-Modifications by TMS



ఈ ఫోరంలో చేసే పోస్టులకు సంబంధించిన పూర్తి బాధ్యత ఆయా సభ్యులే తీసుకోవలసి ఉంటుంది. సభ్యులు చేసే పోస్టులకు ఫోరం నిర్వాహకులు బాధ్యత వహించరు.
[page compression: 13.47 k/14.67 k (8.22%)]